5 లక్షల మంది టీసీఎస్ ఉద్యోగులకు జీతాల పెంపు
Thursday, August 7, 2025 11:32 AM News
దిగ్గజ టెక్ సంస్థ టీసీఎస్ తన ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ లెవల్ నుంచి మధ్య స్థాయి ఉద్యోగుల వరకు 80 శాతం సిబ్బందికి సెప్టెంబర్ 1 నుంచి వేతన పెంపు (శాలరీ హైక్)ను అమలు చేయనున్నట్టు సమాచారం ఇచ్చింది.
ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో టీసీఎస్ సీ హెచ్ ఆర్ఓ మిలింద్ లక్కడ్, సీహెచ్ ఆర్ఓ డెసిగ్నేట్ కే సుదీప్ ఈ విషయాన్ని తెలిపారు. గ్రేడ్ సీ3ఏ, దీనికి సమానమైన అసోసియేట్లకు (మొత్తం ఉద్యోగుల్లో 80 శాతం) వేతన సవరణను అమలు చేయనున్నట్టు స్పష్టం చేశారు. 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ సంస్థ ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. అయితే తాజా వేతన పెంపు ప్రకటనతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



