19న శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల
Saturday, May 17, 2025 09:53 AM News
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆగష్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను ఈ నెల 19 న విడుదల చేయనుంది. భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్లు మే 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 21 ఉదయం 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. అలాగే కళ్యాణం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి సేవలకు ఆర్జిత సేవా టిక్కెట్లు ఈ నెల 22న అందుబాటులో ఉంటాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
