వైఎస్ వివేకా హత్యకేసు, పులివెందుల సీఐ సస్పెన్షన్..!

Friday, March 22, 2019 12:20 PM News
వైఎస్ వివేకా హత్యకేసు, పులివెందుల సీఐ సస్పెన్షన్..!

మాజీ ఎంపీ, ప్రస్తుత వైసీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో పోలీసులకు షాక్ తగిలింది. హత్య కేసును ఛేదించేందుకు ఏపీ పోలీసులు విపరీతంగా ప్రయత్నిస్తునారు, ఇప్పుడు పులివెందుల అర్బన్ సీఐ శంకరయ్యను విధుల నుంచి సస్పెండ్ చేయటం దుమారం రేపింది. అయితే హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించటం, కాపాడటంలో నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ అర్బన్ సీఐ శంకరయ్యను పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. డీఐజీ నాగేంద్రకుమార్ దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చారు. వివేకా హత్య జరిగిన వెంటనే రక్తపు మరకల్ని కడిగేయడంలో కీలకమైన ఆధారాలు దొరికే అవకాశాలు తగ్గిపోయామని పోలీసు శాఖ చెప్తోంది. అంతకుముందు వైసీపీ నేత అవినాష్ రెడ్డి తీరు పట్ల కూడా సీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

పులివెందులలో సొంత నివాసంలోనే వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురిఅయిన విషయం మనకి తెలిసిందే. ముందుగా ఆయనది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం హత్యేనని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. వివేకానంద రెడ్డి ఒంటిపై ఏడు చోట్ల కత్తితో పొడిచిన గాయాలనున్నట్లు స్పష్టమైంది. తల వెనుక భాగంలో బలమైన గాయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నుదుటిపై రెండుచోట్ల లోతైన గాయాలున్నాయని... ఛాతీ, చేతి వేళ్లపైనా గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో వివేకా హత్యపై సిట్‌తో దర్యాప్తు ప్రారంభించారు. 

For All Tech Queries Please Click Here..!