నేడు ఏపీకి మోడీ.. చేయనున్న శంకుస్థాపనలు ఇవే..
Friday, May 2, 2025 07:51 AM News
-1746152317.jpeg)
అమరావతిలో జరిగే పునః నిర్మాణ కార్యక్రమానికి వెలగపూడిలో దాదాపు 276 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 5 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజల కోసం 35 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఎక్కడా తొక్కిసలాట జరగకుండా బారికేడ్లు పెట్టారు. ప్రతి గ్యాలరీలో వేదిక కనిపించేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ షెడ్లు వేశారు. ఈ సందర్భంగా మోడీ పలు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
శంకుస్థాపనలు ఇవే..
- అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలతో సహా రూ.49వేల కోట్ల విలువైన 74 ప్రాజెక్టులు
- రూ.1,459 కోట్లతో కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రం
- రూ.100 కోట్లతో విశాఖలో యూనిటీ మాల్
- రూ.293 కోట్లతో గుంతకల్లు వెస్ట్ మల్లప్ప రైల్వే ఓవర్ బ్రిడ్జి
- రూ.3,176 కోట్లతో NHAI చేపట్టే 6 జాతీయ రహదారులకు శంకుస్థాపన
- ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 8 నేషనల్ హైవే ప్రాజెక్జుల ప్రారంభం
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: