వంతెన కూలిన ఘటన: ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని
Wednesday, July 9, 2025 04:00 PM News
గుజరాత్ రాష్ట్రంలో బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి కింద బాధిత కుటుంబాలకు ఎక్స్రేషియా ప్రకటించారు. మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
