మద్యం డోర్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్

Wednesday, August 13, 2025 11:00 AM News
మద్యం డోర్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్

ఇంట్లో స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా చాంతాడంత క్యూలలో నిలుచోవాల్సిన పని లేకుండా దర్జాగా కాలు మీద కాలేసుకుని ఇంట్లో కూర్చుని కావాల్సిన మందు తెప్పించుకోవచ్చు. దానితో కలిపి లాగించే స్టఫ్ కూడా ఒకేసారి తెప్పించుకోవచ్చు. ఈ దిశగా ఇప్పటికే పలు రాష్ట్రాలు ముందడుగేశాయి.

ఒడిశా, పశ్చిమ బెంగాల్ మద్యం హోమ్ డెలివరీని అనుమతిస్తున్న తొలి రెండు భారతీయ రాష్ట్రాలుగా ఘనత దక్కించుకున్నాయి. ఇదే కోవలో స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థల ద్వారా ఆన్ లైన్ మద్యం అమ్మకాలను అనుమతించే అవకాశాన్ని అనేక ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ లు ముందు వరుసలో ఉన్నాయి. వీటిలో కేరళ రేపో మాపో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

కేరళ స్టేట్ బేవరేజెస్ (మార్కెటింగ్ మాన్యుఫ్యాక్చరింగ్) కార్పొరేషన్ లిమిటెడ్ (బిఇవిసిఒ) రాష్ట్రంలో ఆన్లైన్ అమ్మకాల ద్వారా మద్యం ఇంటికి డెలివరీ చేసే ప్రతిపాదనను ఇటీవలే ముందుకు తెచ్చింది. కేరళలో ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలను సులభతరం చేయడానికి అబ్కార్ చట్టాన్ని సవరించే గతంలో రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చినప్పటికీ, బిఇవిసిఒ ఈ ప్రతిపాదనను మరోసారి తెరపైకి తెచ్చింది. కోవిడ్ సమయంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా ఆన్లైన్లో మద్యం అమ్మకాన్ని ప్రవేశపెట్టింది. దీని కోసం ఒక అప్లికేషన్ కూడా అభివృద్ధి చేసింది. మద్యం వనరు ప్రధాన ఆదాయ మార్గంగా ఉన్న తరుణంలో కోవిడ్ కాలపు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవచ్చుననే అభిప్రాయాలు వస్తున్నాయి. ఆదాయం కోసం ఆవురావురు మంటున్న మన తెలుగు రాష్ట్రాలు సైతం అదే బాటలో నడిచే అవకాశం లేకపోలేదు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: