నిరుద్యోగులకు కేంద్రం కొత్త పథకం
Monday, August 18, 2025 07:04 PM News
దేశంలో కొత్త ఉద్యోగాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు 'ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజన' పేరిట ఓ పోర్టల్ ను ప్రారంభించింది. తొలిసారి ఉద్యోగంలో చేరేవారు ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా తెలిపారు.
జూలై 1న కేంద్ర కేబినెట్ ఈ పథకానికి ఆమోదం తెలపగా రూ.లక్ష కోట్లతో వచ్చే రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



