భారత్ ను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ కొత్త ప్లాన్
Friday, May 2, 2025 11:00 AM News

భారత్ దాడి చేస్తే ఎదురుదాడి చేయడానికి పాకిస్తాన్ మరో కొత్త ప్లాన్ సిద్ధం చేసింది. భారతీయ నిఘా సంస్థలు షాకింగ్ విషయాలు వెల్లడించాయి. దీంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. పాకిస్తాన్ ఇప్పటికే తన సైన్యాన్ని భారత సరిహద్దుల్లో మోహరించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ సాయంతో భారత సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం. ఈమేరకు బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్ ఉంది.
మరో వైపు పాకిస్తాన్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ గురువారం పాకిస్తాన్ FM రేడియో స్టేషన్లలో భారతీయ పాటలపై నిషేధం విధించింది. పాకిస్తానీ FM రేడియో స్టేషన్లలో భారతీయ పాటల ప్రసారాన్ని తక్షణమే నిలిపివేసిందని PBA సెక్రటరీ జనరల్ షకీల్ మసూద్ తెలిపారు. ఏప్రిల్ 22 భారతదేశాన్ని కుదిపేసిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: