ఆర్టీసీలో త్వరలో 3,038 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Friday, August 8, 2025 04:07 PM News
తెలంగాణ ఆర్టీసీలో త్వరలో 3,038 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సిద్దమైనట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ తరుణంలో ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు మోసగాళ్లు అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న విషయం యాజమాన్యం దృష్టికి వచ్చిందని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
ప్రభుత్వ అనుమతితో సంస్థలో పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభమైందని, ప్రభుత్వ నియామక బోర్డుల ద్వారా నోటిఫికేషన్ త్వరలో వెలువడనుందన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



