Big Breaking: నిమిష ప్రియ మరణశిక్ష రద్దు
కేరళ నర్సు నిమిష ప్రియ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమెకు యెమెన్ ప్రభుత్వం విధించిన మరణ శిక్ష రద్దైనట్లు భారత గ్రాండ్ ముస్తీ అబూబాకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. యెమెనీ విద్యావేత్తలు అక్కడి అధికారులు, దౌత్యవేత్తలతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే అధికారికంగా రాతపూర్వక ధ్రువీకరణ పత్రం రావాల్సి ఉందని పేర్కొంది.
2017లో యెమెన్‌కు చెందిన తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన కేసులో నిమిషా ప్రియాను దోషిగా తేలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిమిష.. సనా కారాగారంలో శిక్షను అనుభవిస్తోన్నారు. అక్కడి చట్టాల ప్రకారం ఆమెకు మరణశిక్ష విధించాల్సి ఉంది. దీనిపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నిలిపివేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ తనవంతు ప్రయత్నాలు చేసింది. ప్రముఖ ఇవాంజలిస్ట్, ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సైతం ఆమెకు అండగా నిలిచారు. యెమెన్ దేశాధినేతలో నేరుగా సమావేశం అయ్యారు. నిమిష ప్రియ మరణశిక్షను రద్దు చేయాలని కోరారు. దీంతో యెమెన్.. మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది. ఇప్పుడు దాన్ని రద్దు చేసింది.

.jpg)

.jpg)