తల్లికి వందనం అమలుపై కొత్త ట్విస్ట్
Sunday, April 27, 2025 04:45 PM News
_(19)-1745752508.jpeg)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చే ప్రయత్నాల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. అయితే, విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తోంది. వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: