రేషన్ బియ్యం పంపిణీలో కొత్త విధానం
Thursday, May 22, 2025 07:57 AM News
ఆంధ్రప్రదేశ్ లో నిత్యావసర సరుకుల పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (ఎండీయూ) ద్వారా ఇంటింటికీ రేషన్ అందించే ప్రక్రియను నిలిపివేసి, తిరిగి చౌకధరల దుకాణాల (రేషన్ షాపుల) ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నూతన విధానం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



