త్వరలో సూది లేని ఇంజెక్షన్..!
Thursday, April 17, 2025 02:34 PM News
త్వరలోనే సూదిలేని ఇంజెక్షన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు 'ఇంటెగ్రి మెడికల్' సంస్థ ప్రకటించింది. "ఎన్-ఫిస్' పేరిట సూది రహిత ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపింది. ఈ పరికరం మందును అధిక వేగంతో చర్మం పై ఉండే రంధ్రాల్లోకి జొప్పిస్తుందని, దాంతో ఎలాంటి నొప్పి లేకుండా కండరాల్లోకి ఔషధం వెళ్తుందని పేర్కొంది. దీనిని దేశంలో వెయ్యి మంది వైద్యులు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారని ఇంటెగ్రి మెడికల్ సంస్థ తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)