Breaking: భూమి మీదకు సునీత విలియమ్స్.. సేఫ్ ల్యాండింగ్ (వీడియో)
అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలలు గడిపిన తర్వాత నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమికి తిరిగి వచ్చేశారు. వీరిద్దరూ బుధవారం తెల్లవారుజామున (భారత కాలమాన ప్రకారం) స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ 'ఫ్రీడమ్' క్యాప్సూల్‌లో సురక్షితంగా దిగారు. ఊహించని సవాళ్లు, చారిత్రాత్మక క్షణాలతో నిండిన మిషన్ విజయవంతంగా ముగిసింది.
ఫ్లోరిడా తీరంలో స్పేస్‌ఎక్స్ క్రూ-9 మిషన్ భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి, దిగిన కచ్చితమైన క్షణాన్ని నాసా X (గతంలో ట్విట్టర్), యూట్యూబ్, NASA+లో లైవ్ కవరేజ్ ఇచ్చింది. విలియమ్స్, విల్మోర్‌తో పాటు స్పేస్‌ఎక్స్ క్రూ-9 వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు. డ్రాగన్ వ్యోమనౌక భూమికి చేరుకుని పారాచూట్‌లను తెరిచింది. తిరిగి ప్రవేశించిన తర్వాత వ్యోమనౌకను స్థిరీకరించడానికి రెండు డ్రోగ్ పారాచూట్‌లు, ల్యాండింగ్‌కు ముందు వ్యోమనౌక వేగాన్ని మరింత తగ్గించడానికి నాలుగు ప్రధాన పారాచూట్‌లను అమర్చారు. ఈ అద్భుత ఘట్టాన్ని మీరూ తిలకించండి..



