తెలంగాణలో భారీ అగ్నిప్రమాదం
Sunday, August 24, 2025 06:31 AM News
తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారం వద్ద ఉన్న ఎస్ఆర్ ల్యాబ్ లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడటంతో కార్మికులు భయంతో బయటికి పరుగులు తీశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



