లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులు

Friday, June 20, 2025 11:00 AM News
లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులు

తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత సత్ఫలితాలను ఇస్తోంది. తాజాగా నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 12 మంది సభ్యులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయారు. వారికి ఎస్పీ ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస భృతిని అందజేశారు. కాలం చెల్లిన సిద్ధాంతాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు ఎస్పీ సూచించారు.

జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వీరితో కలిపి మొత్తం 294 మంది దళ సభ్యులు వివిధ హోదాల్లో డీవీసీఎంలు3, ఏసీఎంలు 17, పీఎంఎస్ 34, మిలీషియం మెంబర్లు 107, పీఆర్‌సీ మెంబర్లు 35, డీఏకేఎంఎస్, కేఏఎంఎస్ 47, సీఎన్‌ఎం మెంబర్లు 30, జీఆర్‌డీ మెంబర్లు 21 మంది జనజీవన స్రవంతిలో కలిసి తగిన పునరావాస సౌకర్యాలను పొందారు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: