స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
Monday, August 25, 2025 04:34 AM News
తెలంగాణలోని చర్లపల్లిలో వైష్ణవి ఎన్ క్లేవ్ సమీపంలోని స్క్రాప్ గోదాంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగకు తోడు భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలతో పాటు ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



