రాష్ట్రంలో పెరగనున్న మద్యం ధరలు?
Friday, April 18, 2025 11:00 AM News

ఇటీవల బీర్ల ధరలను 15 శాతం పెంచిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మద్యం ధరలు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. చీప్ లిక్కర్ మినహా రూ.500కు పైగా ధర ఉండే లిక్కర్ బాటిళ్లపై కనీసం 10 శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం బాటిల్ పై మినిమమ్ రూ.50 పెరిగే అవకాశముంది.
ఆయా బాటిళ్ల ఎమ్మార్పీ ఆధారంగా రేట్లు పెరగనున్నాయి. అధికారులతో సమీక్షించిన అనంతరం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: