జీతం అడిగినందుకు రాత్రికి రాత్రే ఉద్యోగాలు తీసేశారు
Saturday, August 23, 2025 11:00 AM News
జీతం అడిగినందుకు రాత్రికి రాత్రే ఉద్యోగాలు తీసేశారు. ఈ ఘటన ఉప్పల్ లో వెలుగులోకి వచ్చింది. జీతం అడిగితే కంపెనీ నుంచి తీసుకొచ్చి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూర్చొ పెట్టి మనోవేదనకు గురి చేశారని, రాత్రికి రాత్రే ఉద్యోగాల నుంచి తొలగించారని సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాపోయారు.
ఉప్పల్ ఐడీఏలోని ఐటీ పార్కులో ప్రూజెస్ ఐటీ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో వీరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. మంగళవారం విధుల్లో ఉన్నప్పుడు జులై జీతాలు ఎప్పుడు ఇస్తారని యాజమాన్యాన్ని అడిగారు. దాంతో వెంటనే పోలీసులను రప్పించి రాత్రి ఒంటిగంటకు 14 మందిని స్టేషన్కు తీసుకొచ్చారు. బుధవారం ఉదయం 11 గంటల వరకు ఉంచారని ఉద్యోగులు తెలిపారు. ఉద్యోగులు గొడవ చేయడంతోనే కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. అందుకే స్టేషన్ కు తీసుకొచ్చామని చెప్పారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)