జనసేనకు గుడ్ న్యూస్.. పవన్ కళ్యాణ్ పంతం నెరవేరింది
Tuesday, January 21, 2025 11:15 PM News
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలోకి జనసేనను చేర్చింది. జనసేనకు గాజుగ్లాసు గుర్తు రిజర్వ్ చేస్తూ మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు లేఖ రాసింది. ఇటీవలే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పిఠాపురంలో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదన మేరకు మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ప్లీనరీ నిర్వహించాలని తీర్మానించిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
