లిక్కర్ స్కామ్: ఛార్జ్ షీట్ లో జగన్ పేరు
Sunday, July 20, 2025 08:54 PM News
ఏపీలో లిక్కర్ స్కాం కేసులో సిట్ అధికారులు శనివారం ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరును అందులో పలుమార్లు ప్రస్తావించారు.
నూతన మద్యం విధానం రూపకల్పన, తదనుగుణంగా తీసుకున్న విధాన నిర్ణయాలు, ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు? ఎక్కడికి ఆ సొమ్మును మళ్లించారు? అనే అంశాలను ఛార్జ్ షీట్ లో సమగ్రంగా వివదించారు. ఆయా సందర్భాల్లో కొన్ని చోట్ల జగన్ పేరును ప్రస్తావించారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



