ప్రమాదకర విమానాశ్రయాల జాబితా: అందులో 8 మన విమానాశ్రయాలే..
భద్రతా ప్రమాదాలు ఎదుర్కొంటున్న వాటిలో ఇండియన్ ఎయిర్‌పోర్టులు కూడా ఉన్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా తన స్టోరీలో పేర్కొంది. డేంజర్ జోన్ లో ముంబై, అహ్మదాబాద్ సహా 8 విమానాశ్రయాలు ఉన్నట్టు వెల్లడించింది.
పట్టణ ప్రాంతాల్లో మారుతున్న పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా 50 విమానాశ్రయాల్లో ప్రతికూలంగా ఉన్నాయి. అలాంటి వాటిలో 8 మన దేశంలోనే ఉన్నాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం టాప్ ప్లేస్‌లో ఉంది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం 12వ స్థానంలో ఉంది. బెల్జియన్ పరిశోధకులు టైస్ గ్రిప్పా అండ్ ఫ్రెడెరిక్ డోబ్రుస్జ్కేస్ 2022లో ఈ అధ్యయనం చేపట్టింది. You’re Surrounded! Measuring the Enclosure of Airports in Urban Areas పేరుతో అధ్యయనం నిర్వహించారు. విమానాశ్రయాల చుట్టూ పెరిగిపోతున్న నివాస ప్రాంతాల గురించి ఈ అధ్యయనం ఎక్కువ ఫోకస్ చేసింది.
ఎయిపోర్టులకు సమీపంలో అంటే దాదాపు 15 కిలోమీటర్ల పరిధిలో జనావాసాలు పెరిగిపోవడం వల్ల ప్రమాదాలకు అవకాశం ఎక్కువ ఉంటుందని పేర్కొంది. వీటి ఆధారంగానే "ఎన్‌క్లోజర్ ఇండెక్స్"ను తీసుకొచ్చింది. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న నివాసాలు ప్రమాద తీవ్రత పెంచుతాయని అంటోంది. ఈ ప్రాంతాల్లో ధ్వని, వాయు కాలుష్యం అక్కడి ప్రజలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. ముంబై విమానాశ్రయం ఎన్‌క్లోజర్ ఇండెక్స్‌లో 21,82,819 స్కోర్ కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి ఎక్కువ. అహ్మదాబాద్ 10,82,503 కలిగి ఉంది. ఇలా ఢిల్లీ, బెంగళూరు, సూరత్ విమానాశ్రయాలు కూడా ప్రమాదకరమైన జాబితాలో ఉన్నాయి.

.jpg)
.jpg)
.jpg)