మీ భూమిని మీకు తెలియకుండా ఇతరుల పేరు మీదికి మారిస్తే...

Sunday, July 27, 2025 12:28 PM News
మీ భూమిని మీకు తెలియకుండా ఇతరుల పేరు మీదికి మారిస్తే...

మీ భూమిని మీకు తెలియకుండా ఇతరుల పేరు మీదికి మారిస్తే విల్లేజ్ రెవిన్యూ ఆఫీసర్, మండల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ మండల సర్వేయర్, తహసిల్దార్ సెక్షన్ 197 సీఆర్పీసి ప్రకారం నేరస్తులు అవుతారు.

తప్పు చేసిన ప్రతి ప్రభుత్వ అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకొనవచ్చు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు  మంజూరు విషయంలో ఒక్కరి భూమి మరొక్కరి 1బి ఆడంగల్ మంజూరు చేస్తే ఆడంగల్ మరియు 1బి కరెక్షన్ కోసం రైతులు ROR చట్టం కింద రెవిన్యూ డివిజనల్ అధికారి దగ్గర అప్పీల్ గాని, జాయింట్ కలెక్టర్ దగ్గరకు గాని అప్పీల్ వెళ్ళవలసిన అవసరం లేదు. సంబంధిత తహసిల్దార్ కు అర్జీ పెట్టుకోవాలి (మీ భూమి పత్రాలు చూపించి ఆ అర్జీకి జిరాక్స్ జతపరచాలి) మీతో విచారణ చేయకుండా మీ భూమిని ఇతరులకు ఆన్లైన్ నందు 1బి, ఆడంగల్, పట్టాదారు పసుపుస్తకం మంజూరు చేసినందుకు గాను విల్లేజ్ రెవిన్యూ ఆఫీసర్, మండల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, తహసిల్దార్ సెక్షన్ 197 సీఆర్పీసి ప్రకారం నేరస్తులు అవుతారు. వీరి మీద చర్యలు తీసుకోమని పై అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు పై అధికారులు చర్యలు తీసుకొనకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం క్రిమిల్ అప్పీల్ నెం 1837/2019 కింద శిక్షకు అర్హులు. తప్పుచేసిన ప్రతి ప్రభుత్వ అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకొనవచ్చు పై అధికారుల అనుమతి అనవసరం. ఈ తీర్పు ప్రతి ప్రభుత్వ అధికారికి వర్తిస్తుంది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: