నేటి నుంచే ఫ్రీ బస్.. ఇవి చూపిస్తేనే జీరో టికెట్
Friday, August 15, 2025 06:47 AM News
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. సూపర్ సిక్స్ హామీల్లో ఇది కూడా ఒకటి. ఇచ్చిన హమీ మేరకు స్త్రీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం నేటి నుంచి ప్రారంభం కానుంది. కేవలం జిల్లా స్థాయిలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఈ ఉచితం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్ ప్రెస్ లలో మాత్రమే వర్తిస్తుంది. అయితే ఏపీ రాష్ట్రానికి చెందిన మహిళలు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని అధికారులు ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో ఈ రోజు రాత్రి నుండి జీరో టికెట్ జారీ చేయనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



