అర టన్ను సొర రూ.34 వేలు

Sunday, August 10, 2025 05:09 PM News
అర టన్ను సొర రూ.34 వేలు

అనకాపల్లి జిల్లా పూడిమడక తీరం నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల గాలానికి భారీ సొర చేప చిక్కింది. 5 గంటలపాటు కష్టపడి దాన్ని తీరానికి లాక్కొచ్చారు. పడవలోకి చేర్చలేక తాడుతో కట్టి లాక్కొచ్చారు. 15 అడుగుల పొడవు, 500 కిలోల బరువైన సొరను పూడిమడక తీరంలో ఇప్పటి వరకూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఆ సొరను తింటారని, వేలం వేయగా రూ.34 వేలకు ఓ వ్యాపారి కొనుగోలు చేసినట్లు మత్స్యకారుడు తెలిపారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: