Big Breaking: హైదరాబాద్ లో 208 మంది పాకిస్తానీలు.. సీఎంకు అమిత్ షా ఫోన్
Friday, April 25, 2025 04:04 PM News

Lకేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. హైదరాబాద్ లో ఉన్న పాకిస్తానీల గురించి ఆరా తీశారు. హైదరాబాద్ లో 208 మంది పాకిస్తానీలు ఉన్నట్టు తెలిపారు. అమిత్ షా అన్ని రాష్ట్రాల సీఎంలకు కూడా ఫోన్ చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులను భారత్ విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ దేశస్తులను గుర్తించి వెనక్కి పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించి భారత్ మీదకు ఉసిగొల్పుతుందని ఆ దేశంలో దౌత్య సంబంధాలు రద్దు చేసింది. ఇండియాలో పాకిస్తాన్ హైకమిషన్ ఆఫీస్ కూడా ఖాళీ చేసి వెళ్లాలని విదేశాంగ శాఖ ఆదేశాలు పంపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: