జగన్ పై కేసు.. హైకోర్టు కీలక ఉత్తర్వులు
Friday, June 27, 2025 01:06 PM News
సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. జగన్ సహా ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను జులై 1న (మంగళవారం) చేపడతామని హైకోర్టు తెలిపింది. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. పల్నాడు పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కింద పడి చనిపోయినట్లు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



