హెచ్సీఏ ప్రధాన కార్యదర్శి అరెస్ట్
Friday, July 25, 2025 08:53 PM News
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారాల కేసులో సంస్థ ప్రధాన కార్యదర్శి దేవరాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. సీఐడీ అధికారులు అతడిని పుణేలో అదుపులోకి తీసుకున్నారు. హెచ్సీఏ అక్రమాల కేసులో దేవరాజ్ ఏ2గా ఉన్నారు. తాజా అరెస్టుతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును పోలీసులు ఇది వరకే అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



