మొదటి రాత్రే వధువుకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్ ఇచ్చిన వరుడు.. ఆ తరువాత..

Saturday, July 19, 2025 10:00 AM News
మొదటి రాత్రే వధువుకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్ ఇచ్చిన వరుడు.. ఆ తరువాత..

పెళ్లి జరిగిన మొదటి రాత్రి వధువుకు వరుడు ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్ ఇచ్చి గర్భధారణ పరీక్ష చేయమని చెప్పిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లాలో జరిగింది. ఈ నెల 12న ఒక మహిళతో వ్యక్తికి పెళ్లి జరిగింది. నూతన వధువు వరుడి ఇంటికి చేరుకుంది. అయితే పెళ్లి అలసట, వేడి వాతావరణం వల్ల ఆమె నిరసంగా కనిపించింది. ఆ రాత్రి తనకు తల తిరుగుతున్నట్లు చెప్పింది.

దాంతో వధువు తీరుపై వరుడు ఆందోళన చెందాడు. తన స్నేహితుల వద్ద ఈ విషయం చెప్పాడు. గర్భందాల్చిన సంకేతాలు కావచ్చని వారు జోక్‌ చేశారు. దీంతో నవ వరుడు మరింత కలత చెందాడు. సమీపంలోని మెడికల్‌ షాప్‌లో ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్ కొన్నాడు. దానిని వధువుకు ఇచ్చి గర్భధారణ పరీక్ష చేయమని చెప్పాడు. దీంతో వరుడి తీరుపై ఆ వధువు ఆగ్రహించింది. తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పింది. దీంతో వారంతా వరుడి ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు కుటుంబాల మధ్య రెండు గంటలపాటు పెద్ద గొడవ జరిగింది. చివరకు గ్రామస్తులు జోక్యం చేసుకున్నారు. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. జరిగిన విషయాన్ని వరుడు వివరించాడు. అందరి ముందు తన తప్పును ఒప్పుకున్నాడు. మరోసారి ఇలా ప్రవర్తించబోని హామీ ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమణిగింది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: