ఎపిపి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Tuesday, June 10, 2025 09:17 AM News
_(8)-1749520440.jpeg)
తెలంగాణ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టుల్లో 118 ఏపీపీ ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి అనుమతిచ్చారు. దీంతో త్వరలో రాష్ట్ర పోలీసు నియామక బోర్డు నియామక ప్రక్రియ చేపట్టనుంది.
అర్హత గల అభ్యర్థులను ఎంపిక చేయాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు త్వరలో పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. అర్హత, వయోపరిమితి, పరీక్ష విధానం తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో తెలియజేయనున్నారు. అభ్యర్థులు తమ అర్హతలను తనిఖీ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: