Breaking: పట్టాలు తప్పిన రైలు
Friday, July 4, 2025 10:10 PM News
మహబూబ్ నగర్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నగరంలోని బోయపల్లి గేట్ వద్ద 6వ నంబర్ బోగి పట్టాలు తప్పినట్లు లోకో పైలట్ గుర్తించి రైలును నిలిపివేశారు. సుమారు 20 మీటర్ల మేర సిమెంటు పట్టాలపై రైలు వెళ్లింది. గూడ్స్ రైలు రామగుండం నుంచి తమిళనాడుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో మహబూబ్ నగర్-కర్నూలు మార్గంలో 3 గంటలుగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వద్ద మరమ్మతులు చేపడుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)