రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధర
Thursday, August 7, 2025 08:44 PM News
బంగారం మరోసారి కొండెక్కి కూర్చుంది. అమెరికా అధ్యక్షుడు టారిఫ్ ప్రకటనల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి మదుపర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరిగింది. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ఒకే రోజు రూ.3,600 మేర పెరిగి రూ.1.02,620 వద్ద రికార్డు స్థాయికి చేరింది. నిన్న ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రూ.99,020గా ఉందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
