తిరుమల కొండపైకీ ఉచిత బస్సు.. కానీ..
Wednesday, August 20, 2025 07:05 AM News
ఏపీలో మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని తిరుమల కొండపైకి కూడా అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ఈ విషయాన్ని వెల్లడించారు.
అయితే ఘాట్ రోడ్డు కావడం వల్ల పరిమిత సంఖ్యలోనే సీటింగ్ కు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఇటీవల తిరుమల కొండపైకి ఉచిత బస్సు సౌకర్యం లేదని టీటీడీ తెలపడంతో తాజాగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ఈ ప్రకటన చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)