114 విమానాలు రద్దు
Saturday, June 7, 2025 11:00 AM News
ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (DIAL) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ప్రయాణికులకు పెద్దగా అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసి కొన్ని విమాన సర్వీసులను మాత్రమే 3 నెలలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు డీఐఏఎల్ సీఈవో కుమార్ జైపురియార్ తెలిపారు. ప్రతిరోజూ 1,450 విమాన సర్వీసులు నడున్నాయని, వీటిలో 114 ఆపరేషన్లను రద్దు చేస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 15 వరకూ ఇది అమల్లో ఉంటుంది.
విమానాశ్రయంలోని కీలక రన్వేలలో ఒక రన్‌వేపై అప్‌గ్రేడేషన్ పనులు చేపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



