Breaking: కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
Monday, June 30, 2025 04:12 PM News
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. సిమ్లాలోని భట్టకుఫర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రతా కారణాల రీత్యా అందులోని ప్రజలను అధికారులు ముందే ఖాళీ చేయించారు. దీంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. సమీపంలోని మరిన్ని భవనాలకు కూడా ముప్పు పొంచి ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా, ఆ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



