Breaking: మరో విమానంలో మంటలు
Thursday, June 26, 2025 07:34 AM News
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరవక ముందే మరో విమానంలో మంటలు చెలరేగాయి. అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన ఓ ఫ్లైట్ లాస్ వెగాస్ లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నార్త్ కరోలినా ఎయిరో పోర్టుకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇంజన్లో పొగలు వచ్చాయి. విమానం గాల్లో ఉండగానే ముందుగా పెద్ద శబ్ధం రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో పైలెట్లు వెంటనే అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా లాండ్ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



