వాహనదారులకు గుడ్ న్యూస్
Wednesday, June 18, 2025 01:18 PM News
ఫాస్టాగ్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.3 వేల తో ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకుని 200 ట్రిప్పులు ప్రయాణించే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఈ నిర్ణయం ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. వాణిజ్యేతర వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్లకు కేంద్రం అవకాశం ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఏ రహదారిపై ప్రయాణించిన ఇది చెల్లుబాటు కానుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



