తెలంగాణలో 13, ఏపీలో 5 పార్టీల గుర్తింపు రద్దు
Sunday, August 10, 2025 09:00 AM News
దేశ వ్యాప్తంగా 334 రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. చట్టబద్దమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 334 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రద్దైన రాజకీయ పార్టీలలో తెలంగాణ నుంచి 13, ఏపీ నుంచి 5 పార్టీలు కూడా ఉన్నాయి.
ఈ పార్టీలు గత ఆరేళ్లుగా ఎన్నికలలో పోటీ చేయకపోవడం వల్ల వీటి వివరాలను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



