గణేశ్ నిమజ్జనంలో అపశృతి.. ఇద్దరు మృతి

Sunday, August 31, 2025 08:46 PM News
గణేశ్ నిమజ్జనంలో అపశృతి.. ఇద్దరు మృతి

గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. అల్లూరి జిల్లా పాడేరు మండలం చింతలవీధిలో గణేశ్ శోభాయాత్ర నిర్వహిస్తున్న సమయంలో స్కార్పియో వాహనం అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.

క్షతగాత్రులను పాడేరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కార్పియో వాహనం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: