ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
Friday, June 20, 2025 08:00 AM News
తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న 'డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ' (దోస్త్) మూడో విడత రిజిస్ట్రేషన్ల గడువును పొడిగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు మరియు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపళ్ల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మండలి ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని వెల్లడించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



