జగన్ ఆస్తులు జప్తు..!

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. దాల్మియా సిమెంట్స్ కు చెందిన రూ.793 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. సున్నపురాయి గనుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, ప్రతిగా జగన్ కంపెనీలో దాల్మియా పెట్టుబడులు పెట్టిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నిధుల మళ్లింపు జరిగిందని ఈడీ అనుమానిస్తోంది. దీనికి ప్రతిగా భారీగా ముడుపులు చేతులు మారాయని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.
తమకు చెందిన రూ.793.34 కోట్ల ఆస్తుల తాత్కాలిక జప్తుపై ఈడీ గత నెల 31న ఉత్తర్వులిచ్చిందని.. ఆ ప్రతిని ఈ నెల 15వ తేదీన తాము అందుకున్నామని డీబీసీఎల్ బుధవారం ప్రకటించింది. ఇది తాత్కాలిక జప్తు మాత్రమేనని.. దీనివల్ల తమ కంపెనీ కార్యకలాపాలకు ఎటువంటి అడ్డంకులూ ఉండవని, యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. ఈడీ ఆదేశాలను న్యాయపరంగా ఎదుర్కొంటామని పేర్కొంది.