ఏడుగురికి జీవిత ఖైదు విధించిన కోర్టు
Thursday, June 26, 2025 02:00 PM News
తెలంగాణలోని జగిత్యాలలో పడాల రాజిరెడ్డి అనే వ్యక్తిని ఏడుగురు వ్యక్తులు కర్రలతో దాడి చేసి 2021 జూన్ 15న హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో ఆధారాలు లభించడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారిని దోషులుగా నిర్ధారించారు. దీంతో ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ, ఆరుగురికి 3500 చొప్పున మరో వ్యక్తికి 4 వేల చొప్పున జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



