భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Thursday, May 22, 2025 02:00 PM News

ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. దీంతో విపత్తుల నిర్వహణ సంస్థలో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధితులు సహాయక చర్యలకు టోల్ ఫ్రీ నెంబర్లు 1070,112, 18004250101 2 నంబర్లను సంప్రదించాలని కోరారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: