యాంటీ శాటిలైట్ వెపన్ పూర్తి సమాచారం మీకోసం.

Friday, March 29, 2019 07:42 AM News
యాంటీ శాటిలైట్ వెపన్ పూర్తి సమాచారం మీకోసం.

దీన్నే కైనటిక్ స్టిల్ వెపన్ అంటారు. ప్రత్యేకంగా వార్‌హెడ్లు ఉపయోగించకుండ శత్రు శాటిలైట్లను పేల్చేసే వ్యవస్థ ఇది. శత్రుదేశాల కారణంగా అంతరిక్షంలో భద్రతాపరమైన సమస్యలు ఏర్పడినప్పుడు వీటిని ఉపయోగిస్తారు. అంతరిక్షంలో నిరుపయోగంగా ఉన్న శాటిలైట్లను పేల్చివేసేందుకు కూడా యాంటీ శాటిలైట్ వెపన్స్ పనికొస్తాయి.

యాంటీ శాటిలైట్ల వెపన్స్‌ను తయారుచేయడంలో అగ్రరాజ్యాలు ఎంతో ముందున్నాయి. అమెరికా, చైనా, రష్యాలు ఈ శాటిలైట్ కిల్లర్స్‌ను ఎప్పుడో తమ అమ్ములపొదిలో చేర్చుకున్నాయి. అంతరిక్ష పరిశోధనలకు ఆద్యులైన అమెరికా, సోవియట్ యూనియన్ లు ఈ విధ్వంసకర ఆయుధాల తయారీకి శ్రీకారం చుట్టాయి.

కోల్డ్‌వార్ సమయంలోనే ఈ రెండు దేశాలు దాదాపు 54సార్లు ఈ యాంటి శాటిలైట్ వెపన్స్ పరీక్షించాయి. 1985లో తన వెదర్ శాటిలైట్ స్లోవిండ్‌ను అమెరికా ఇదే పద్దతిలో కూల్చేసింది. 1985 సెప్టెంబర్‌లో భూమికి 555కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపగ్రహాన్ని తునాతునకలు చేసింది. 1964లో అప్పటి సోవియట్ రష్యా ఈ ప్రయోగం నిర్వహించింది.

భారత్‌కు పక్కలో బల్లెంలాంటి పొరుగుదేశం చైనా కూడా 2007లోనే యాంటి శాటిలైట్ టెస్ట్ చేసింది. తన వెదర్ శాటిలైట్ చెడిపోయిందన్న నెపంతో దాన్ని పేల్చేసింది.

దాదాపు 40వేల ముక్కలైన ఆ ఉపగ్రహ శకలాలు నేటికీ భూమిచుట్టూ తిరుగుతున్నాయి. చెడిపోయిన ఉపగ్రహాన్ని నాశనం చేసేందుకు పేల్చేశామని చైనా సుద్దులు చెప్పినా..తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలపడమే దాని ఉద్దేశమన్నది బహిరంగ రహస్యం.

For All Tech Queries Please Click Here..!