సింహాచలం ప్రమాదానికి కారణం అదే
Wednesday, April 30, 2025 02:56 PM News
_(28)-1746005153.jpeg)
సింహాచలం అప్పన్న ఆలయం వద్ద ఇటీవల కట్టిన గోడ కూలి ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో కాంట్రాక్టర్, అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. రూ.300, రూ.1000 టికెట్ లైన్లను క్యూకాంప్లెక్స్ కు అనుసంధానం చేస్తూ నిర్మాణం చేపట్టారు. కాంక్రీట్ బీమ్ కానీ, దిమ్మె కానీ నిర్మించకుండా 20 అడుగుల గోడ కట్టారు. భారీ వర్షానికి నీరు, మట్టి కొట్టుకురావడంతో ఒత్తిడి పెరిగి గోడ కూలి భక్తులపై పడటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
గోడ వద్ద ఓ భారీ టెంట్ ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున వచ్చిన భారీ ఈదురుగాలులకు ఆ టెంట్ గోడపై పడటంతో అది కూలి విషాదం నెలకొన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అప్పన్న చందనోత్సవాల్లో భాగంగా 20 రోజుల కిందటే ఈ గోడ నిర్మించినట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: