హైదరాబాద్ వాసులకు బిగ్ అలెర్ట్
Thursday, June 26, 2025 07:59 AM News
హైదరాబాద్ లో నేటి నుంచి బోనాల పండుగ సందడి ప్రారంభం కానుంది. దీంతో నగరవ్యాప్తంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూన్ 26, 29, జూలై 3, 6, 10, 13, 17, 20, 24 తేదీలలో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. అయితే ట్రాఫిక్ జామ్ కారణంగా వచ్చే సమస్యల కోసం 9010203626 అనే హెల్ప్ లైన్ కు కాల్ చేయవచ్చు.
చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభమవుతుంది. ముందుగా లంగర్ హౌస్ చౌరస్తాలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి అధికారికంగా బోనాలను ప్రారంభిస్తారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



