క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
Thursday, August 28, 2025 08:23 PM News
ఏపీలోని క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన క్రీడా ప్రోత్సాహకాలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. రూ.4.9కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేసినట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
దీంతో రాష్ట్రంలోని 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు లబ్ధి చేకూరనుంది. క్రీడలు, క్రీడాకారుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని కూటమి ప్రభుత్వం నిరూపించుకుందని ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ రవినాయుడు అన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



