క్వారీ ప్రమాదం: ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
Monday, August 4, 2025 03:26 PM News
ఏపీలోని బాపట్ల జిల్లా బల్లికురవ లో నిన్న జరిగిన గ్రానైట్ క్వారీ ప్రమాదం లో ఆరుగురు మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.14 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



