మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
Sunday, June 29, 2025 10:36 PM News
ఇటీవల అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరగగా, మరికొన్ని విమానాలు పలు కారణాలతో అత్యవసర ల్యాండ్ అవడం ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరొక విమానంలో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. టోక్యో నుంచి ఢిల్లీ రావాల్సిన బోయింగ్ 787 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ కోల్ కత్తా విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయంగా వేరే విమానంలో తరలిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



