జైలుశిక్ష నుంచి తప్పించుకున్న అనిల్ అంబానీ

Tuesday, March 19, 2019 07:42 AM News
జైలుశిక్ష నుంచి తప్పించుకున్న అనిల్ అంబానీ

రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ జైలుకు వెళ్లకుండా తప్పించుకున్నాడు. స్వీడన్ టెలికాం కంపెనీ (ఎరిక్సన్) బకాయిల చెల్లింపు వ్యవహారంలో ఉన్న ఉత్కంఠకు తెరపడింది. ఎరిక్సన్ బకాయిలు చెల్లించడానికి కోర్ట్  ఇచ్చిన తేది (మార్చి 19,2019) ముగియడానికి ఆర్‌కామ్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండగా, తాజాగా ఆ సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని (రూ.462 కోట్లు) ఆర్‌కామ్ పూర్తిగా చెల్లించింది. ఈ విషయాన్ని ఎరిక్సన్ ప్రతినిధి ఒకరు అధికారికంగా వెల్లడించారు. రూ.462కోట్ల బకాయిలను రిలయన్స్ సంస్థ తమ ఖాతాలో జమచేసినట్లు కంపెనీ ప్రతినిధి చెప్పారు. 

ఎరిక్సన్‌కు రూ. 550 కోట్ల బకాయిలను నాలుగు వారాల్లో చెల్లించాలని గత నెల సుప్రీం కోర్టు ఆర్‌కామ్‌ను ఆదేశించిన విషయం మనకి తెలిసిందే. లేనిపక్షంలో జైలుశిక్ష తప్పదని అనిల్ అంబానీని హెచ్చరించిన సంగతీ విదితమే. అయితే ఇప్పుడు ఎరిక్సన్ సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని (రూ.462 కోట్లు) ఆర్‌కామ్ పూర్తిగా చెల్లించింది. ఈ లావాదేవిలో ముకేశ్ అంబానీ తమ్ముడికి సహాయం అందించారు.

For All Tech Queries Please Click Here..!